హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చ్ 25(నమస్తే తెలంగాణ): భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి దేవాదాయశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ భద్రాచలం పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటిదశలో భాగంగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈమేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటిదశలో గోదావరి ఘాట్ విస్తరణ, ఆధునిక వసతులతో అభివృద్ధి, ఆలయ సముదాయం విస్తరణ, పరిసర ప్రాంతాల సదుపాయాల మెరుగుదల వంటి ప్రధాన పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం గోదావరి ఘాట్‌కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, పరిసర అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు.