హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్‌భవన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ ఈ సందర్భంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణతో పాటు హెచ్‌సీయూ భూముల వివాదం, సన్నబియ్యం పంపిణీ వంటి పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ భేటీ సుమారు గంటన్నర పాటు కొనసాగింది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, వారికి శాఖల కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గ విస్తర్ణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు చోటు దకే అవకాశం ఉంది.
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో ఆరుగురికి క్యాబినెట్లో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో నలుగురికి మాత్రమే చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. మరో ఇద్దరికి కొంతకాలం తర్వాత అవకాశం లభించనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.