హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన’ దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లేఖలు పంపారు.
1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురసరించుకొని రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
ముఖ్యమంత్రి వెల్ఫేర్ ఫండ్‌కు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ రూ.5కోట్లు విరాళంగా అందించింది. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రూ.కోటి, ఏఎంఆర్ ఇండియా రూ.కోటి, నటుడు నందమూరి బాలకృష్ణ రూ.50లక్షలు, వాక్సెన్ యూనివర్సిటీ రూ.50 లక్షలు అందజేశారు.