షాద్‌నగర్, జనవరి 31: రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో ఏడు శాతం నిధులను కేటాయించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ ప్ర భుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవం లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యంలో నూ ముందుండాలని అన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నదని.. మాజీ ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణరావు, మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాస్‌రావు, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మహానుభావులను అందించిన ఘనత ఈ పాఠశాలదని అన్నారు. చరిత్ర కలిగిన మొగిలిగిద్ద గ్రామ అభివృద్ధికి రూ.16 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కొదండరాంరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ప్రోఫెసర్ హరగోపాల్‌లు పాల్గొన్నారు.