CM Revant Reddy | బీఆర్జీఎఫ్ నిధులు రూ.1800 కోట్లు ఇవ్వండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revant Reddy | 2019-20 నుంచి 2023-24 వరకు బీఆర్జీఎఫ్ కింద తెలంగాణకు రావాల్సిన రూ.1800 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
CM Revant Reddy | వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అయిదేళ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించిందని ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశారని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో బీఆర్జీఎఫ్ కింద తెలంగాణకు రావల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి…
రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. ఆ కారిడార్లతో పాటు హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయండి
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయని, వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

