హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటంబ సర్వేకు సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు తమ వివరా లు ఇవ్వనేలేదనే అంశం చర్చీనీయాంశం గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు అసలు పట్టించుకోవడమే లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా వివరాలు ఇవ్వనేలేదు. దీంతో సర్వత్రా వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన వీరే సర్వేకు వివరాలు ఇవ్వనప్పుడు తామెందుకు ఇవ్వాలంటూ ఎన్యుమరేటర్లను పలుచోట్ల సామన్య జనం ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఇంటింటి స మగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం శ్రీ కారం చుట్టింది. సర్వేపై ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దని, నిర్భయంగా వివరాలు ఇవ్వాలంటూ సీఎంతోపాటు మం త్రులంతా ప్రజలకు పిలుపునిచ్చారు. తీరా చూస్తే సీఎంతోపాటు మంత్రులం తా సర్వేలో తమ కుటుంబాల వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం. సర్వే తొలిరోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ వివరాలను మాత్రం అధికారులు సేకరించారు. ఆ తర్వాత మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ కుటుంబ సర్వేలో వివరాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. సీఎంతోపాటు మిగిలిన మంత్రులు తమ వివరాలను ఇచ్చినట్టు ఎక్కడా ప్రకటించలేదు. ఇటు హైదరాబాద్‌లో, అటు జిల్లాల్లోనూ వారు తమ వివరాలు ఇవ్వలేదని తెలిసింది. రెండురోజు ల క్రితం సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి ఎక్స్‌లో కుటుంబ సర్వేకు సంబంధించి ఒక పోస్ట్ చేశారు. దీనిపై అజయ్‌రెడ్డి అనే ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో తమ వివరాలు ఇచ్చారో తెలపాలని, ఆ వివరాలను పోస్ట్ చేయాలని కోరారు. కానీ ఈ ప్రశ్నకు సీపీఆర్వో నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. దీంతో సర్వేలో సీఎంతోపాటు మంత్రులు తమ వివరాలను ఇవ్వలేదనేది తేటతెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యం గా ఆస్తుల వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాల సేకరణపై ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు. అనేక చోట్ల ఈ వివరాలను ఇచ్చేందు కు నిరాకరిస్తున్నారు. దీంతో సర్వే కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సీఎం, మంత్రులు తమ వివరాలు ఇవ్వడంపై వెనుకంజ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రభు త్వం ఒక ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభిస్తే.. తొలుత ప్రభుత్వ లేదా పార్టీ పెద్దల నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. కానీ, ఆస్తుల వివరాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయోననే ఆందోళనతో వారంతా సర్వేకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కుటుంబ సర్వేలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర మంత్రుల కుటుంబాల వివరాలను సేకరించారో లేదో తెలుసుకునేందుకు సర్వే నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించింది. ఆయనకు ఫోన్ చేయగా స్పందించలేదు. వాట్సప్‌లో మెసేజ్‌కు కూడా స్పందన కరువైంది.
కుటుంబ సర్వేలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబాల వివరాలు ఇవ్వకపోడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు తమ వివరాలివ్వాలని ఆదేశిస్తున్న వాళ్లంతా ఎందుకు ఇవ్వడం లేదని ఎన్యూమరేటర్లకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముందుగా వాళ్ల వివరాలు తీసుకొని ఆ తర్వాత తమ వద్దకు రావాలని కరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు.