తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి : మంత్రి దయాకర్
తెలంగాణ వార సంపద, కాకతీయుల కళా విశిష్టతను, చారిత్రక ప్రసిద్ధ ఆలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్,
జనగాం: తెలంగాణ వారసత్వ సంపద, కాకతీయుల కళా విశిష్టతను, చారిత్రక ప్రసిద్ధ ఆలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో వెలసిన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అధికారులు, నిపుణులతో కలిసి సందర్శించారు.
నియోజకవర్గంలో ఉన్న ఐదు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 50 కోట్లతో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివరాత్రికి పాలకుర్తి కళ్యాణ మండపం ప్రారంభం చేసుకుంటున్నామని,ఆది కవి పాల్కురి సోమనాథుడి విగ్రహం ప్రతిష్టిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ. 25 కోట్ల వ్యయంతో హరిత హోటల్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
హోటల్ కోసం స్థలం ఇచ్చిన స్థానికులకు వేరే చోట ఇండ్లు ఇచ్చి, టూరిజంలో ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. బమ్మెరలో 22 అడుగుల పోతన విగ్రహం తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. వల్మిడి గుట్ట పై వాల్మీకి భారీ విగ్రహం పెడుతున్నామని మంత్రి తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ ప్రపోల్ దేశాయ్, దేవాలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిపుణులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

