సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 28: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధత, అచంచల విశ్వాసం, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకొంటారని సీఎం తెలిపారు. సృష్టి లయకారుడిగా శివుడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకొంటారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.