CM KCR | హైదరాబాద్, నమస్తే తెలంగాణ (అక్టోబర్ 21) : తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఇప్పటికే ఖరారైపోయిందని బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తెలిపారు. బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో ప్రజలు ఇప్పటికే నిర్ణయించేశారని, ఈ సారి వంద సీట్లు రావడం ఖామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంతో విరాజిల్లుతున్నదని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంతో బీఆర్ఎస్ మంచి జోష్తో ఉంటే.. ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే ఉన్నాయన్నారు. దిల్లీ గులాముల దగ్గర సాగిలపడుతున్నారని బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తొమ్మిదిన్నర ఏండ్లుగా కేసీఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారని, అందుకే ప్రజలు కేసీఆర్ వైపు ఉంటున్నారని బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తెలిపారు. సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కువైట్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. సోషల్ మీడియా, కాల్ క్యాంపెయిన్ ద్వారా విస్త్రృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు.