CM KCR | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 15న హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 16వ తేదీన జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో, 18న జడ్చర్ల నియోజకవర్గంలో 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఇక అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.