జగిత్యాల: మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రేగుంట నుంచి సీఎం రోడ్డు మార్గాన హైదరాబాద్ బయల్దేరారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి తండ్రి సురేష్ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈ రోజు రేగుంట(మెట్ పల్లి)లోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. pic.twitter.com/SQ8y80FFYL
— TRS Party Chennur (@trspartychennur) June 9, 2021