CM KCR | 24న ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజేశం, జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాధవేని మల్లేశ్, సీఐ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

