హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): సర్వమత సమానత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో మరోసారి గంగా జమునా తెహజీబ్‌ను చాటేలా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. సెక్రటేరియట్లో నిర్మించిన నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిని ఒకేరోజు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 25న నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి, సీఎం కేసీఆర్ దేవాలయాన్ని పునఃప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సంప్రదాయాలను అనుసరించి మసీదు, చర్చిని కూడా ప్రారంభిస్తారు.