హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు)తోపాటు రాష్ట్ర కార్యవర్గం హాజరు కానున్నది. కేసీఆర్ అందరితో కలిపి సంయుక్త సమావేశం నిర్వహిస్తారు.