జనగామ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొని ప్రసంగించనున్నారు. తొలుత జనగామలో జరుగనున్న సభలో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జనగామ గులాబీ మయమైంది. సిద్దిపేట రోడ్డులోని మెడికల్ కాలేజీ గ్రౌండ్ సిద్ధమైంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కటౌట్లు, హోర్డింగ్‌లతో నిండిపోయింది. సభా స్థలికి ఇప్పకే వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. పాటలు, నృత్యాలతో కళాకారులు హోరెత్తిస్తున్నారు.
జనగామ బహిరంగ సభ అనంతరం సీఎం కేసీఆర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హజరవుతారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైలా శేఖర్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.