CM KCR | హైదరాబాద్ : ఇవాళ్టి వరకు 51 బీ-ఫారాలు మాత్రమే రెడీ అయ్యాయని, మిగతావి రేపు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక బీ-ఫారాలు నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. పొరపాటు చేయొద్దని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
శ్రీనివాస్ గౌడ్, వనమా వెంకటేశ్వర్ రావు, కృష్ణ మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. గెలవలేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కారణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మనకు మంచి న్యాయకోవిదులు ఉన్నారు. మీకు గైడ్ చేయడానికి న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమాషాలు చూస్తుంటాం. ఈ ఎన్నికల్లో నిబంధనలు మారుస్తుంటారు. ప్రతిది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాకు తెలుసులే అని అనుకోవద్దు. 98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్ పని చేస్తున్నారు.అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇప్పట్నుంచే నామినేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చివరి రోజున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించొద్దు. ఇవాళ 51 బీ-ఫారాలు తయారు చేశాం. బీ-ఫారాలు నింపేటప్పుడు.. అప్డేట్ ఓటర్ జాబితాను అనుసరించాలి. మిగతా బీ-ఫారాలు రెడీ అవుతున్నాయి.. రేపు అవి కూడా అందిస్తామని కేసీఆర్ తెలిపారు.