CM KCR | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరి న్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు. ఆదివా రం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభ లో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘కర్ణాటకలో ఎన్నికలు రాగానే ఇంటికి అర లీటరు పాలు, ఉచిత సిలెండర్ ఇస్తామని బీజేపీ వాళ్లు హామీలు ఇచ్చారు. కానీ ఏమైంది? ప్రజలు ఈడ్చి కొట్టారు. అట్లనే ఉన్నది మన దగ్గర కాంగ్రెసోళ్ల తీరు. అన్నీ అలవికాని హామీలు ఇస్తారు. ఖమ్మంలో సభ పెట్టి రూ.4 వేలని ఒక నంబర్ చూపించి వెళ్లారు. గెలిచేదా? సచ్చేదా? బరువా? బాధ్యతనా? అందుకే అట్ల మాట్లాడుతున్నారు. ఇట్లాంటి హామీలే కర్ణాటకలో ఇచ్చారు. ఇప్పుడేమో పైసలు లేవు.. ఏమి చేద్దామని కర్ణాటక ముఖ్యమంత్రి తల పట్టుకుంటున్నారు. ఇవాళే పత్రికల్లో కూడా వచ్చింది- ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించి వాగ్ధ్దానాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నరని. ఇదీ.. అక్కడి కాంగ్రెస్ పరిస్థితి. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యం గా చెయ్యాలి.
4 ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి.. అలవికాని హామీలు ఇవ్వడం ఎం దుకు? ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఇస్తున్న పింఛన్ ఎంత? ఏ ఒక్క రాష్ట్రంలోనూ వెయ్యి రూపాయలకు మించి పింఛ న్ ఇవ్వడం లేదు. కానీ, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు ఇస్తారట. కాం గ్రెస్ విషయంలో గతంలోనూ మనకెన్నో అనుభవాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ, మేం కాంగ్రెసంత గొప్పోళ్లం కాదని, రూ.1లక్ష వరకే మాఫీ చెస్తామని చెప్పాం. మాకు 88 సీట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 19 సీట్లే వచ్చినయ్. అలవికానియి చెప్తే.. ఎటుబడితే అటు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఏది, ఎప్పుడు, ఎట్ల పెంచాలో మాకు తెలుసు. ఒక్కసారే పెం చం. క్రమపద్ధతిలో పెంచుకుంటూ వెళ్తాం.
కాంగ్రెసోళ్లు అనుకుంటున్నారు అలవికానివేవో చెప్పేసి అధికారం కొట్టుకుపోదామని. కానీ, మా దగ్గర ఇంకా ప్రజలకు కావాల్సినవి, మేం నెరవేర్చగలిగినవి గంపెడు ఉన్న య్. కొత్త అస్ర్తాలు మస్తుగున్నయ్. ప్రజలను సంక్షేమబాట పట్టించినది, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది, సంక్షేమాన్ని అమలు చేసి నడిపిస్తున్నదే మేము. అన్నీ దశలవారీగా అమలుచేస్తాం. రాష్ట్రం ఏర్పడిన కొ త్తలో ఆర్థిక పరిస్థితి ఎట్లుంటదో అర్థం కాలేదు. అందుకే.. పింఛన్ మొదట వెయ్యి రూపాయలే ఇచ్చినం. ఆ తర్వాత ఆర్థికంగా బలపడుతూ రూ.2 వేలు చేసినం. కల్యాణలక్ష్మి మొదట్లో రూ.51 వేలు ఇచ్చుకున్నం. తర్వాత రూ.లక్షకు పెంచుకున్నం. గొర్రెల పంపిణీలో యూనిట్‌కు రూ.లక్ష ఆ తర్వాత రూ.1.75 లక్షలకు పెంచాం. రైతుబంధును రూ.4 వేలతో ప్రారంభించాం. తర్వాత రూ.5 వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఇంకెంత పెంచగలమో ఆలోచన చేస్తాం. ఆ దిశగా పెంచుకుంటూ వెళ్తాం.
కాంగ్రెస్ వేసిన అనేక పీటముడుల్లో సీపీఎస్ (కాంట్రీబ్యూటరీ పెన్షన్) ఒకటి. దీనిని కాంగ్రెస్ తెచ్చింది. బీజేపీ కొనసాగిస్తున్నది. ప్రభుత్వ, ఉద్యోగ భాగస్వామ్యంతో పెన్షన్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. కానీ, దానిని తిరిగి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇందులో ఏమి చేయవచ్చో? ఏమి చేయకూడదో? అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. సీపీఎస్ విషయంలో కొన్ని రాష్ర్టాల్లో కొన్ని పద్ధతులు, మరికొన్ని రాష్ర్టాల్లో మరికొన్ని పద్ధతులున్నాయి.