CM KCR Press meet | దేశం మొత్తం మీద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.. అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలను తిప్పి కొట్టారు. తెలంగాణ ఇచ్చే డబ్బుల మీదనే కేంద్రం నడుస్తోందని.. ఆ విషయాన్ని ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు.
ఈ 7 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము 42 వేల కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు కూడా వచ్చింది. అందులో ఒకటి నరేగా, ఎన్ఆర్హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్. వీటి మీద వచ్చిందే. స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 450 కోట్లు బీఆర్జీఎఫ్ ఫండ్స్ రావాలి. అవి ఎగ్గొట్టారు. వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు కేంద్రం మెడలు వంచి తీసుకురారు. మంత్రుల మీద.. ముఖ్యమంత్రుల మీద మాత్రం ఆరోపణలు చేస్తరు. కేంద్రం సహకరించకున్నా కూడా సొంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నం. 5 ఏళ్ల వరకు హైకోర్టునే విభజించలేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటా గురించి ఇప్పటి వరకు తేల్చలేదు. మీ అసమర్థతనా.. మీ చేతగాని తనమా.. మీ అవివేకమా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు. నవోదయ పాఠశాలల చట్టం ఉంది. దానిపై ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 50 సార్లు దరఖాస్తు ఇచ్చా. కానీ.. కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఎక్కడ పోయిర్రు మరి రాష్ట్ర బీజేపీ నేతలు. ఇక్కడి కేంద్ర మంత్రి ఎక్కడికి పోయిండు. ఎందుకు వీటిపై కేంద్రంతో మాట్లాడరు. ఎందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేకపోయారు. ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు.. అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ