CM KCR Press Meet : రాష్ట్ర బీజేపీ నేతల గుట్టు మొత్తం బయటపడిందని.. ఇకనైనా బీజేపీ నేతలు తమ చిల్లర పనులు మానుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా చిల్లర మల్లర రాజకీయాలు మానుకోండి. మీ గుట్టు మొత్తం బయటపడింది. మీరేందో అందరికీ అర్థం అయింది. ఇంకా మీరు పిచ్చిపిచ్చి మాటలు..పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. మీ కథేందో తెలిసిపోయింది జనాలకు. వాళ్లకు పూర్తిగా అర్థం అయింది. మీరు చేసిన తప్పుకు పొరపాటు అయింది.. క్షమించమని చెంపలేసుకొని ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలి. అనవసరమైన బేషజాలకు పోకుండా… వాస్తవాలు ప్రజలకు తెలపాలి. రైతులను ఇకనైనా తప్పుదోవ పట్టించకండి రైతులు కూడా బీజేపీ నేతల మాటలు పట్టుకొని ఆగం కావద్దు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.