హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బొగ్గు గని దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు చికుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. శిథిలాల కింద చికుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. గాయపడిన వారిని తక్షణమే దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శిథిలాల నుంచి కార్మికులను బయటకు తెచ్చే చర్యలు ముమ్మరం చేశామని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని, వెంటనే పూర్తి వివరాలు అందించనునున్నట్టు సీఎండీ శ్రీధర్ కేసీఆర్‌కు వివరించారు.