Ben Curran : అంతర్జాతీయ క్రికెట్లో జింబాబ్వే ఆటగాడు బెన్ కరన్ (Ben Curran) అరుదైన రికార్డు పట్టేశాడు. ఓపెనర్‌గా వచ్చి యాభై ఓవర్లు ఆడిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శతకంతో రెచ్చిపోయిన బెన్.. చివరి దాకా క్రీజులో నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో జింబాబ్వే ఓపెనర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. ఆఫ్రికా దేశం తరఫున ‘ఫ్లవర్ బ్రదర్స్’ ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ మొదటగా ఈ ఫీట్ సొంతం చేసుకున్నారు.
జింబాబ్వే క్రికెట్లో కొత్త తారగా దూసుకొచ్చిన బెన్ కరన్ వన్డేల్లో రెండో శతకంతో రెచ్చిపోయాడు. హారారే స్పోర్ట్స్ క్లబ్లో బంగ్లాదేశ్‌పై ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుర్రాడు చివరిదాకా క్రీజులో నిలిచి మరో రికార్డు దక్కించుకున్నాడు. తద్వారా ఈ అరుదైన రికార్డు సాధించిన జింబాబ్వే తొమ్మిదో ఓపెనర్‌గా బెన్ చరిత్రకెక్కాడు. 1992లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఓపెనర్ ఆండీ ఫ్లవర్(Andy Flower) 50 ఓవర్లు ఆడాడు. అతడి సోదరుడైన గ్రాంట్ ఫ్లవర్(Grant Flower) 1994లో ఇంగ్లండ్‌పై చివరిదాకా క్రీజులో నిలిచాడు.
◾ Andy Flower vs SL, 1992
◾ Grant Flower vs ENG, 1994
◾ Neil Johnson vs AUS, 1999
◾ Alistair Campbell vs IND, 2000
◾ Craig Wishart vs NAM, 2003
◾ Hamilton Masakadza vs KEN, 2009
◾ Brendan Taylor vs SA, 2010
◾ Brian Bennett vs IRE, 2025
◾ 𝗕𝗲𝗻 𝗖𝘂𝗿𝗿𝗮𝗻 𝘃𝘀… pic.twitter.com/RwG9rD2c9v— Cricinfo (@cricinfo) July 9, 2026
అనంతరం జింబాబ్వే ఓపెనర్లు నీల్ జోసెఫ్(ఆస్ట్రేలియాపై, 1999లో), అలిస్టెయిర్ క్యాంప్‌బెల్(భారత్‌పై, 2000లో), క్రెగ్ విషార్ట్(నమీబియాపై, 2003లో), హామిల్టన్ మజకజ్ద(కెన్యాపై, 2009లో), బ్రెండన్ టేలర్(దక్షిణాఫ్రికాపై, 2010లో), బ్రియాన్ బెన్నెట్(ఐర్లాండ్‌పై, 2005లో) ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి 50 ఓవర్లు బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రస్తుతం బ్రియన్ జట్టులో కొనసాగుతుండగా.. మిగతావారంతా రిటైరయ్యారు.