న్యూయార్క్: జోర్డాన్‌పై ఇరాన్ అటాక్ చేసింది. మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే 8 ఇరానీ క్షిపణులను ఇంటర్సెప్ట్(Missiles Intercepted) చేసినట్లు జోర్డాన్ పేర్కొన్నది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పలేదు. టెహ్రాన్ నుంచి క్షిపణులను ప్రయోగించినట్లు జోర్డాన్ పేర్కొన్నది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. సైరన్లు మోగాయి. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్లు మోగించినట్లు జోర్డాన్ తెలిపింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను జోర్డాన్ ఎయిర్‌స్పేస్‌లో డిటెక్ట్ చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. జోర్డాన్ సైనిక దళాలు నిత్యం హై అలర్ట్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మరో వైపు అమెరికా ఫైర్ చేసిన ఓ ప్రొజెక్టైల్.. బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో పడినట్లు తెలుస్తోంది. బుషెహర్ ప్రావిన్సుకు చెందిన డిప్యూటీ గవర్నర్ ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా తన తాజా దాడుల్లో బుషెహర్ ప్రావిన్సులోని అనేక ప్రాంతాలను టార్గెట్ చేసింది. దీనిలో భాగంగా న్యూక్లియర్ కేంద్రం వద్ద కూడా ప్రొటెక్టైల్ పడినట్లు అంచనా వేస్తున్నారు. న్యూక్లియర్ ప్లాంట్ వద్ద దాడి జరిగినట్లు ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. మధ్యాహ్నం సమయంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై స్పందించలేదు. రష్యా టెక్నీషియన్లు ఆ న్యూక్లియర్ ప్లాంట్‌ను మానిటర్ చేస్తున్నారు.