Almonds | బాదంపప్పును రోజూ తినవచ్చా.. దీన్ని ఎవరు తినాలి, ఎవరు తినవద్దు, ఎంత మోతాదులో తినాలి..
బాదంపప్పు భారతీయ ఇళ్లలో తరతరాలుగా ఉపయోగిస్తున్న ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. పరీక్షల సమయంలో పిల్లలకు బాదం పెట్టడం, గాజర్ హల్వా వంటి స్వీట్లలో కలపడం, టిఫిన్ బాక్స్‌లో ఇవ్వడం వంటి అలవాట్లు చాలా కాలంగా ఉన్నాయి.
Almonds | బాదంపప్పు భారతీయ ఇళ్లలో తరతరాలుగా ఉపయోగిస్తున్న ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. పరీక్షల సమయంలో పిల్లలకు బాదం పెట్టడం, గాజర్ హల్వా వంటి స్వీట్లలో కలపడం, టిఫిన్ బాక్స్‌లో ఇవ్వడం వంటి అలవాట్లు చాలా కాలంగా ఉన్నాయి. ప్రస్తుతం అవిసెగింజలు, గుమ్మడి విత్తనాలు, వాల్నట్స్, మకాడామియా నట్స్ వంటి ఇతర నట్స్, సీడ్స్ ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ, బాదం ఇప్పటికీ అత్యంత పోషకవిలువలు కలిగిన ఆహారాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. అయితే బాదాన్ని ఎంత మోతాదులో తినాలి? ఎవరికి ప్రయోజనం? ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి? వంటి సందేహాలకు పోషకాహార నిపుణులు సమాధానాలు ఇచ్చారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, పాలీఫెనాల్స్ వంటి అనేక కీలక పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, ఆకలిని నియంత్రించడానికి, మొత్తం ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.
ఎంత తినాలి..
రోజుకు ఎంత బాదం తినాలనే విషయం వయసు, శారీరక శ్రమ, శరీరానికి అవసరమైన శక్తి, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రోజుకు 28 నుంచి 42 గ్రాముల వరకు, అంటే సుమారు 23 నుంచి 35 బాదంపప్పులు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మోతాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా సహాయపడుతుంది. బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని పెద్దలు చెప్పే మాటకు కూడా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు, ప్రోటీన్, మెగ్నీషియం, పాలీఫెనాల్స్ మెదడు కణాలను ఆక్సిడేటివ్ నష్టం నుంచి కాపాడటంలో, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రీడయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా బాదం తీసుకున్నప్పుడు జ్ఞాపకశక్తి, కొన్ని మేధో సామర్థ్యాల్లో మెరుగుదల కనిపించినట్లు వెల్లడైంది.
వీరు దూరంగా ఉంటే మంచిది..
అయితే ప్రతి ఒక్కరూ బాదం అధికంగా తీసుకోవడం మంచిది కాదు. మూత్రపిండాల తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ పొటాషియం లేదా ఫాస్ఫరస్ పరిమితం చేయాలని సూచించినవారు వైద్యుల సలహాతోనే బాదం తీసుకోవాలి. అలాగే బరువు తగ్గేందుకు తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారు కూడా మోతాదును నియంత్రించాలి. చెట్టు గింజలకు అలెర్జీ ఉన్నవారు బాదాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాదం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ అధికంగా తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రోజువారీ మొత్తం కేలరీలను తగ్గించకుండా ఎక్కువ మోతాదులో బాదం తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ఒక్కసారిగా ఎక్కువ బాదం తినడం ప్రారంభిస్తే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణకోశ అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల బాదం మోతాదును క్రమంగా పెంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సమయం ఏది..?
బాదంను తినడానికి ప్రత్యేకంగా ఒక సమయం లేదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారంతో, మధ్యాహ్నానికి ముందు లేదా సాయంత్రం చిరుతిండిగా, భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా భోజనానికి ముందు లేదా చిరుతిండిగా బాదం తింటే ఆకలి తగ్గి, ఎక్కువగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు కూడా దోహదపడుతుంది. బిస్కెట్లు, స్వీట్లు, నమకీన్ వంటి అనారోగ్యకరమైన చిరుతిండ్లకు బదులుగా బాదాన్ని తీసుకోవడం మరింత ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

