ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం గర్వకారణం : సీఎం కేసీఆర్
IAMC | భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను

హైదరాబాద్ : భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారు. నిజానికి ఇటీవలి కాలంలో మీరు హైదరాబాద్‌లో చాలా చేస్తున్నారు. సరియైన ప్రాపగండా చేస్తలేరు అని విదేశీ స్నేహితులు తనతో చెప్పారు. నిన్న కూడా ఇద్దరు ముగ్గరు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. మీరు అసలు ప్రమోట్ చేయట్లేదు. హైదరాబాద్ సింగపూర్ కన్నా బాగుంది అని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోంది. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదు.
న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్ సెంటర్లలో పరిష్కారాలు లభ్యమవుతుండటం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి సౌకర్యం భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో రావడం, రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణం. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కంపెనీలు, పెట్టుబడిదారుల మధ్య వివాదాలను పరిష్కరించడం ఈ సెంటర్ లక్ష్యం. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు తీసుకొస్తామన్నారు. మంచి ఉత్తమమైన సెంటర్‌ను ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మనకు కేసీఆరే బాద్షా.. అమిత్ షానో, ఇంకో షానో తెలంగాణ ప్రజలకు అవసరం లేదు: కేటీఆర్
Vemulawada | వేములాడ ఆలయంపై ఏది నిజం.. గోపుర తొలగింపుపై 3 రకాల ప్రకటనలు?
Palnadu Water Grid | తెలంగాణకు ‘గర్భ’శోకం.. సాగరగర్భంలో ఆంధ్రా సర్జ్‌పూల్.. యుద్ధ ప్రాతిపదికన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు
Horoscope | 21-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
పల్నాడు వాటర్‌గ్రిడ్ అనైతికం.. ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ అనుమతి లేదు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

