CM KCR | సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని తెలిపారు. చాలా రోజుల నుంచి కటాఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. ఈ క్రమంలో కటాఫ్ మార్కులు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇతర వర్గాల చేసిన విధంగానే ఎస్సీ, ఎస్టీలకు ఆ లెవల్‌కు తగ్గిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ సంఖ్యను పెంచినం కాబట్టి.. ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఆహారం, మంచి జరిగేలా అవకాశం ఉండాలని, ఈ మేరకు మంత్రులు చర్యలు తీసుకుంటామని, అలాగే తాను సైతం సమీక్ష నిర్వహిస్తానన్నారు.