CM KCR | అభ్యర్థులు ప్రజల్లో ఉండాలి.. ప్రతీ కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి: సీఎం కేసీఆర్
రాజకీయాలు అన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు.
హైదరాబాద్: రాజకీయాలన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు. అందరి కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండాలని సూచించారు. చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. దీనిని ప్రతిఒక్కరు తప్పకుండా పాటించాలని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల సందర్భంగా వ్యక్తిత్వం మార్చుకోవాలని ఒకరిద్దరికి చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారన్నారు.
జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని కేసీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

