CM KCR | హైదరాబాద్ : వర్షాభావ పరిస్థితులు, గోదావరిలో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, తాగు, సాగునీటి అవసరాలపై కేసీఆర్ చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, నీటి పారుదల ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు హాజరయ్యారు.