శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 15:33:52

కరోనాపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

కరోనాపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

హైదరాబాద్‌ : కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర, అత్యున్నత సమీక్షా సమావేశాన్ని ప్రగతి భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, మహముద్‌ అలీ, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌,  అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. 

ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకడంతో.. విమానాశ్రయాల్లో వారికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలనీ, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని సీఎం తెలిపారు. 


logo