సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీ హబ్(T- Hub) ఎకోసిస్టమ్ స్టార్టప్ ధ్రువ స్పేస్‌కు(Dhruva Space) రూ.123 కోట్ల నిధులు ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ అల్పా ఫండ్ నుంచి లభించింది. హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ టెక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ కంపెనీ ఈ నిధులను రాబోయే అంతరిక్ష నౌకల తయారీ సౌకర్యం, ప్రపంచ మార్కెట్‌కు విస్తరించడానికి అవసరమైన ఉత్పత్తులను రూపొందించనున్నారు.
పుల్ స్టాక్ స్పేస్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ధృవ స్పేస్ సేవలను అందిస్తోందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు సంజయ్ నెక్కంటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్లు, శాటిలైట్ ఎనేబుల్డ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో ధృవ స్పేస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోందని తెలిపారు.