CM KCR Press Meet : ఈ వర్షాకాలంలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈసందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. ఆందోళన చెందవద్దు. ఇంకో రెండు రోజులు వర్షాలు పడుతాయని అంటున్నారు కాబట్టి.. వీలు చూసుకొని ఐకేపీకి సెంటర్కు ధాన్యాన్ని తీసుకురండి. త్వరలోనే అందరికీ రైతు బంధు కూడా అకౌంట్లలో జమ చేస్తం. యాసంగిలో ఏ పంటలు వేయాలి.. అనే దానిపై మాత్రం త్వరలోనే మీకు స్పష్టంగా తెలియజేస్తాం.. అని రైతులకు సీఎం కేసీఆర్ వెల్లడించారు.