తెలంగాణ గర్వించే బిడ్డ ఈశ్వరీబాయి
దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు.
- జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకొన్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గత పాలనలో విస్మరించిన ఈశ్వరీబాయి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
దేశానికి దళితబంధు ఆదర్శం
ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దళితుల ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసేలా, వారిలో ఆత్మైస్థెర్యం నింపేలా ‘దళితబంధు’ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దళిత బహుజన మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగించాలనే సృ్పహను యావత్తు దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టామని చెప్పారు. అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

