విజయరామారావుకు సీఎం కేసీఆర్ నివాళి
అనారోగ్యంతో మృతిచెందిన మాజీ మంత్రి కే విజయరామారావు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుష్పాంజలి ఘటించారు.
- మాజీ మంత్రి కుటుంబీకులకు ముఖ్యమంత్రి పరామర్శ
- అధికారిక అంత్యక్రియల ఏర్పాట్లపై అధికారులతో ఆరా
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్: అనారోగ్యంతో మృతిచెందిన మాజీ మంత్రి కే విజయరామారావు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుష్పాంజలి ఘటించారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం 3లోని కేవీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయరామారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ, కొడుకు శ్రీనివాస కళ్యాణ్‌లను ఓదార్చారు. ఇంటిపెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియల ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కడియం శ్రీహరి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నేతలు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నారదాసు, డీజీపీ అంజనీకుమార్, కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు విజయరామారావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

