CM KCR | హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్( Babu Jagjivan Ram ) 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు బాబూజీ అని సీఎం చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారు. కార్మిక లోక పక్షపాతి బాబూ జగ్జీవన్ రామ్. బాబూజీ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నాం. దళితబంధు( Dalit Bandhu ) నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు.