CM KCR | ఇది ఆర్మూర్ జనమా.. ప్రభంజనమా.. జీవన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం
CM KCR | ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | ఆర్మూర్ : ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇది ఆర్మూరు జనమా.. ప్రభంజనమా.. అని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్లో ఒక విషయం అయితే తేలిపోయింది. ఈ సభ సముద్రాన్ని చూసిన తర్వాత జీనవ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతారని స్పష్టంగా తేలిపోయింది. జీవన్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణ ఉద్యమంలో ఉండి.. ఎర్ర జొన్న రైతులకు కోసం ఆరమణ దీక్ష చేశారు. ఫైరింగ్ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలీసు కాల్పులు జరిపింది. నేను ఎక్కడ్నో కరీంనగర్ పర్యటనలో ఉన్నాను. ఇక్కడ కాల్పులు జరిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్కు వచ్చాను. అప్పట్నుంచి నాకు సన్నిహితుడై కుటుంబంలో ఓ సభ్యుడిగలా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు జీవన్ రెడ్డి. ఏదైనా కావాలంటే.. వెంబడి పడి సాధిస్తడు జీవన్ రెడ్డి. మండలాలు కావాలంటే అవసరమా అని ప్రశ్నించాను. జీవన్ రెడ్డి మూడు రోజులు అలిగి కూర్చుండు. అలా పట్టుదలతో, పంథాతో నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడుతుంది. మీ కోసమే పని చేసే వ్యక్తి.. భారీ మెజార్టీతో గెలిపించాలి. కొందరు ఇప్పుడొచ్చి ఆపదమొక్కులు మొక్కుతారు. అవన్నీ నమ్మకండి. ప్రజల కోసం పని చేసే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం పాటు పడే వ్యక్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

