సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాగర్ ఎడమ కాలువ | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ( AMRP ) నుంచి నీటి విడుదలకు కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
నేటి సాయంత్రం వరకు సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో క్రస్ట్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,80,222 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 37,743 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 579.20 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్‌లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

