మహబూబాబాద్ : జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇనుగుర్తి మండలం ఏర్పాటైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు మరో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు కవిత, రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.