హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకొని, భేటీకానున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చించనున్నారు.
కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ బెంగళూరు పర్యటనలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.