CM KCR | వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిని చేసిన మొనగాడు చేసింది ఎవరు?.. ఇవాళ లేనిపోని ఉల్టాపల్టా మాట్లేడే చిల్లగాళ్లు ఎవరు? వరిపంటల వనపర్తి చేసినోడు కావాలా? ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు.. న్యాయం చెప్పాల్సింది మీరేనని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘ఒక్కటే మాట ఆలోచన చేయాలని వనపర్తి బిడ్డలు. వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిని చేసిన మొనగాడు చేసింది ఎవడు? ఇవాళ లేనిపోని ఉల్టాపల్టా మాట్లేడే చిల్లగాళ్లు ఎవరు? వరిపంటల వనపర్తి చేసినోడు కావాలా? ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు.. న్యాయం చెప్పాల్సింది మీరు. నిరంజన్‌రెడ్డి ఇంతకు ముందే మనవి చేశారు. ఆయన మంత్రి అయినా కూడా ఎంత బాధపడుతడో.. చిన్నమందడి.. పెద్ద మందడి.. తండాలు.. చిన్న తండాల పేర్లు తీసుకొని ఇక్కడ లిఫ్ట్ కావాలి.. ఆడ లిఫ్ట్ కావాలి అని అడుగుతడు’ అన్నారు.
‘నేను యాష్టపడ్డ సందర్భంలో కూడా.. ఇద్దరిపై జోకులున్నయ్ రాష్ట్రంలో.. హరీశ్‌రావుపై ఒకటి.. మరొకటి నిరంజన్‌రెడ్డిపై ఉన్నది. నిరంజన్‌రెడ్డికి ‘ఎక్కడన్న తట్టెడు పెండ కనిపిస్తే తీసుకపోయి పొలంలో వేసుకుంటడు’ అనే పేరుంది. తాను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం కాబట్టి.. తెలుసు కాబట్టి.. తన ఆత్మతోని కలగలిసిపోయిన ఏరియా కాబట్టి ప్రతి నీళ్ల చుక్కకోసం పని చేస్తున్నారు. డీ-8 కాలువ కోసం వందసార్లతో నాతో వాదించి చేసిన సందర్భం.
కల్వకుర్తి నుంచి చాలదు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి, ఏదుల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేలా కాలువలు తీర్చిదిద్ది రియర్వాయర్ చేయించిందే నిరంజన్ రెడ్డి కాదా? అని మనవి చేస్తున్నా. ఇవాళ మాట్లాడే పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించింది. ఏదులకుపోయి మందిని ఏపరేపారు. గాలిలో కట్టలేం కదా రిజర్వాయర్లు ? ఎవరో కొందరికి నష్టం జరుగుతుంది. వారికి కడుపునిండా చేసేది చేస్తాం. కానీ, ప్రాజెక్టు కానివ్వకుండా కాళ్లల్లో కట్టులు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏవిధంగా ఆపే ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలుసు’నన్నారు.
‘ఈ మధ్యలోనే పాలమూరును స్విచ్ఛాన్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఒక్క పంపు పోస్తేనే కల్వకుర్తి కెనాల్ అంతా నీళ్లుపోతున్నయ్. అలాంటి తొమ్మిది పంపులు వస్తయ్. శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా నీటిని ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లతో బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాకు కరువు అనేది మళ్లీ మర్రి చూడకుండా.. ఎవడన్న గంజి కేంద్రాలు పెడుతాంటే.. గుంజికొట్టే పరిస్థితుల్లో పాలమూరు తయారుకావాలని కాంక్షతో పని చేశాం. అక్కడ శ్రీనివాస్‌గౌడ్, ఇక్కడ నిరంజన్‌రెడ్డి బ్రహ్మాండమైన మంత్రులు వాళ్ల ఏరియా కోసం, జిల్లా కోసం పరితపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
అనేక అభివృద్ధి చేశారు. ఇవాళ అడ్డంపొడువు మాట్లాడే కాంగ్రెస్.. అనేళ్లు రాజ్యం చేస్తే.. నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కన్నా దొడ్డుగా.. ఎత్తుగా ఉన్నోళ్లు చాలామంత్రులు పాలమూరులో ఉన్నారు. ఒక్కడన్నా మెడికల్ కాలేజీ జిల్లాకు తీసుకువచ్చారా? పాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనులు మా నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కాదా? ఇది చరిత్ర కాదా అని మనివి చేస్తున్నా. తెచ్చింది కాకుండా మళ్లీ నాకు పశువైద్య కళాశాల కావాలని నిరంజన్‌రెడ్డి అంటున్నడు. వాస్తం ఇది చాలా సంస్కారం ఉన్నటువంటి.. కల్చలర్ ఆడియన్స్ ఉన్నటువంటి గొప్ప పట్టణం వనపర్తి’ అని తెలిపారు.
‘ఆయన కృషితో ఆయన కన్న కలనెరవేరి బ్రహ్మాండంగా పనులు జరిగాయ్. నేను కాలేజీ కలెక్టరేట్ ఇనాగ్రేషన్‌కు వస్తే.. నన్ను స్వయంగా తీసుకెళ్లి.. దక్షిణభాగమంతా బైపాస్ రోడ్డు కావాలని.. పసిపిల్లాడిలా నా వెంబడిపడి.. దానికి సాంక్షన్ చేయించారు. అంతేకాదు మళ్లీ ఇవాళ ఉత్తరభాగం రావాలంటున్నారు. నిరంజన్‌రెడ్డి ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అంతకన్నా పెద్దవాడిని చేసే బాధ్యత నాది అని నేను మీకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం కేబినెట్ మంత్రిగా దర్జాగా ఐదేళ్లు మీ సేవలో పునీతమైన వ్యక్తి నిరంజన్‌రెడ్డి కాదా? చాలా మంది వస్తరు.. చాలా మాట్లాడుతరు.. అడ్డంపొడువు మాట్లాడుతరు. ఇవాళ రైతాంగం, ముస్లింలు, దళిత సోదరులు ఒకటే ఆలోచన చేయాలి. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకొని వారికి ఏ పని చేయకుండా.. వారిని పేదవాళ్లను చేసింది కాంగ్రెస్ కాదా? అంటూ ప్రశ్నించారు’ సీఎం కేసీఆర్.