CM KCR Pressmeet | తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయరంగం 21శాతం కంట్రిబ్యూషన్ రాష్ట్ర జీఎస్డీపీలో ఉందన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదని, భగవంతుడి దయతో మంచి వర్షాలు పడుతున్నాయని, అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నామన్నారు. పాలమూరులాంటి జిల్లాలు. నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, దేవాదుల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు.. పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామన్నారు. వాటి ఫలితాలు వచ్చాయన్నారు. ‘24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నం. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయ్.. కొనమంటే అది చేత కాదు. మరి ఏం చేతనైది. మరి ఎవరికి పెడుతరు కిరీటం’ అంటూ విమర్శించారు.
‘డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటే తెలంగాణలో.. మరి రైతుబంధు ఇస్తర? మరి రైతుబీమా ఇస్తరా? ఇవాళ అన్నివర్గాలను పొట్టలో పెట్టుకొని కాపాడుకుంటున్నం. నాయీ బ్రాహ్మణులు డిమాండ్ చేస్తే ఎవరూ పట్టించుకోలే. వారికి ఇవాళ ఉచితంగా 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నం. రజక సోదరుల లాండ్రీలకు 250 యూనిట్లు ఇస్తున్నం. ఫౌల్ట్రి రంగాలకు సబ్సిడీ ఇస్తున్నం. చేనేత కార్మికులను ఆదుకుంటున్నం. ఏ ఒక్క రంగాన్ని నెగ్లెక్ట్ చేశామా? ఇండియా మొత్తంలో బీడీ కార్మికులంటారు. రాష్ట్రలోనైనా ఇస్తరా? బీడీ కార్మికులకు పెన్షన్.. ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఇస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇక్కడ మీ దిక్కుమాలిన బీజేపీ కావాల్నా? మాకు..
మీ చెత్త బీజేపీ.. మీ చేతగాని దద్దమ్మ బీజేపీ కావాల్నా ఈడ.. దేని కోసం కావాలి బీజేపీ? ఉన్నది ఊడగొట్టుకునేందుకా? ఉన్న అంగిలాగు ఊడగొట్టుకునేందుకా? పర్ క్యాపిటా తక్కువ చేసుకునేందుకా? జీఎస్డీపీ తక్కువ చేసుకునేందుకా? కరెంటు కోతలు తెచ్చుకునేందుకా? మంచినీళ్ల కోతలు తెచ్చుకునేందుకా? దేనికి కావాలి. మా ఇష్టం వచ్చినట్లు అడ్డం పొడువు మాట్లాడుతాం.. ఏది పడితే అది మాట్లాడుతాం అంటే ఏందిది. కనిస్తలేదా? కర్నాటక రాష్ట్రం పక్కకే ఉంది కదా.. బీజేపీ పరిపాలన.. మహత్తరమైన కథ. ఇక్కడే ఉంది కదా మధ్యప్రదేశ్ కనిపిస్తలేదా? ఆడ ఏం ఉద్దారకమైతుందో?’ అంటూ విమర్శించారు.
‘ఇవాళ ఎన్పీఏలు దేశంలో.. బిఫోర్ మోదీ ఎంత? ఇవాళ ఎంత? బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీలు మోదీకి తెలియకుండా జరుగలేవు. మీదికి మనం అట్ల అనుకుంటున్నం.. అమాయకులం. వివరాలన్నీ ఉన్నయ్.. వస్తున్నయ్ దేశం ముందు మొత్తం పెడుతాం. మొన్న అడిగిన ప్రశ్న. ఎన్పీఏ అనేది 4లక్షల కోట్లు ఉండే మోదీ రాకముందు చిన్నాచితక కలిపి.. నేను ఒక మాట అడుగుతున్న నరేంద్ర మోదీ గారు.. మీరు పెద్ద కథలు మాట్లాడుతరు కదా? మంది మీద బాగా గూఢచర్యం చేస్తరు కదా? పెగాసస్.. బొగాసస్ అని పెట్టి.. పొద్దున లేస్తే ఫోన్ ట్యాపింగులే కదా మీరు మీ బతుకు. మరి ఈ బ్యాంకు లూటెరగాళ్ల మీద ఎందుకు పెడుతలేరు? ట్యాపింగ్.. మీ ఈడీలు, మీ సీబీఐలు.. మీ సంస్థలు.. దర్యాప్తు.. తోక తొండెం.. బ్యాంకు దెంగలను ఎందుకు పట్టకుంటలేవు? అక్కడ చేతకాదా? అంటే మీరు కూడా అందులో భాగస్వామే.
వాళ్లు కొందరు చెబుతున్న లండన్‌లో ఫ్రెండ్స్‌కి.. ఏ వాళ్లకు ఇచ్చేకాడికి వచ్చి వచ్చామని, ఇక్కడ పిక్నిక్ లాగా ఉన్నమీడ.. మళ్లీ మోదీ గెలువంగనే ఇండియాకు వాపస్ వస్తరట. చెబుతున్నరు ఓపెన్‌గా లండన్‌లో.. 12లక్షల కోట్లా? మీరిచ్చేది ఎన్పీఏల పేరిట. దాంట్ల మీ వాటా ఎంత మోదీ గారు చెప్పండి దేశానికి.. ఎందుకు ఇచ్చారు ఇంత విచక్షణా రహితంగా.. రైతులకు సబ్సిడీ ఇయ్యద్దు.. కరెంటు సబ్సిడీ ఇయ్యద్దు.. కరెంటు మీటర్లు పెట్టాలే? వీళ్లకు మాత్రం లక్షల కోట్ల దోపెట్టాల్నా? ఇది నీతా? నేను ఏదీ అసంబద్ధంగా అడుగలే.. వ్యక్తిమైంది అడుగలే.. మీ ఇంత మహత్తరమైన పాలన అంటే మరి ఈ బ్యాంకు దొంగతనాలు ఎందుకు అరికడుతలేరు? మొన్న రీసెంట్ అయిన దొంగతనంలో దొరికిందే ఆయన. రూ.20కోట్లు బీజేపీకి చందా ఇచ్చినట్లు ఉన్నది లెక్కల్ల. బాజాప్తా దొరికింది.. లెక్కలు ఉన్నయ్.. మరి దాని సంగతేంటి? మరి ఎవరు రాజీనామా చేయాలి? నరేంద్ర మోదా? నిర్మలా సీతారామనా? తలదించుకోవాలి కదా సిగ్గుతో.. మరి దీనినెవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నా’ అంటూ మండిపడ్డారు.
‘ఇంకోమాట నేను అడుగున్నా. ఒక్క దోపిడీగాన్ని.. ఇప్పటి వరకు బ్యాంకును ముంచినోన్ని ఒక్కన్ని ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు.. మీ పోలీసులు.. మీ దోస్తానా? మీ గానాభజనా? మీ విశ్వగురు అనే ప్రచారం. మీకున్న ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించి ఒక్కడినైనా పట్టుకురావచ్చు కదా? మొత్తం దొంగలంతా పిక్నిక్ ఎంజాయ్ చేసుకుంటా అక్కడే ఉంటారా? ఒక్కడినైనా పట్టుకువచ్చేందుకు చేత కాదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి? అమాయకులను పట్టుకొని మీదపడి ఓ కథపెడుతారా? ఈడ. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అడుగున్నా.. నేను ఒక్కడిని కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎందుకు సమాధానం చెప్పరు. సమాధానం లేదంటే చెప్పండి’ అంటూ నిలదీశారు. దేశంలో వంద సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నయ్. 4వేల రూపాయలకే టన్ను దొరుకుతది.
జబర్దస్తీగా దాన్ని 30వేలకు కొను.. 25వేలకు కొను.. ఇది కుంభకోణం కాదా? ఇది లక్షణ కోట్ల కుంభకోణం కాదా? ఇవన్నీ రేపు తప్పకుండా భయటపెడుతాం. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెడుతాం. ప్రజల ముందు పెడుతాం. ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని గద్దెదించి వీటిన్నింటిపై విచారణ జరిపిస్తాం. మీరు తప్పించుకోలేరు. ఎందుకు ఇవాళ సమాధానం చెప్పడం లేదు. మీ మౌనం వెనుక అర్థమేంటి? చెప్పండి? దేశంలో ఎంతో సంపద ఉండగా.. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పరు. ఎందుకు జబర్దస్తీ చేస్తున్నరు? ఎవరి కోసం ? మాకు నరేంద్ర మోదీతో వ్యక్తిగత విరోధం లేదు. మీ పాలసీలనే మేం వ్యతిరేకిస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.