CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్‌లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకోటి నేను చెప్పనా? కొండగల్‌లో ఇంత పొడుగున్నదని నామీద కామారెడ్డిలో పోటీకి వచ్చిండు. అక్కడ వాళ్లు తుక్కుతుక్కు ఓడగొడుతున్నరు. ఆడ అంగిపోయేదాక సంపుతున్నరు. మీరు లాగుపోయేదాక సంపాలి కొడంగల్‌లో’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘మనకు వీళ్ల పీడపోవాలి. కొడంగల్‌కు, తెలంగాణ రాష్ట్రానికి దరిద్రుల పీడ వదిలించుకోవాలి. వీళ్లు రాజకీయాల్లో ఉండదగ్గ మనుషులు కాదు. ఒక నీతి, నియమం, పద్ధతి, ప్రజలపై మీద ప్రేమ ఉన్నోడు రాజకీయాల్లో ఉండాలి కానీ.. భూమి కబ్జాలు పెట్టుడు. పొద్దున లేస్తే పైసల గురించి మాట్లాడుడు. ఇది రాజకీయం అంటరా? దయచేసి కొడంగల్ ప్రజలు పోయినసారి నా మాట గౌరవించి బ్రహ్మాండంగా నరేందర్‌రెడ్డిని గెలిపించారు. రైతుబంధు పంపిస్తున్నాం. రేవంత్‌రెడ్డి ఏమంటున్నడు అది బిచ్చం అంటున్నడు. కేసీఆర్ రైతుబంధు బిచ్చం వేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు బిచ్చమా? ఇంతకు ముందు గొడగొడ ఏడుస్తూ బాధపడ్డ రైతులను, ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని రైతుబంధు తీసుకువచ్చాం. రైతుబంధు ఉండాలా? నరేందర్‌రెడ్డిని రూ.10వేలు ఉన్న రైతుబంధు రూ.16వేలు గ్యారంటీగా అవుతుంది’ అన్నారు.
‘మోసగాళ్లు, డబ్బు సంచులు పట్టుకొని వచ్చేవారు.. 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలనోటోళ్లు.. మూడుగంటల కరెంటు ఇస్తమనేటోళ్లు నమ్మొద్దు. మీ పక్కనే కర్నాటకలో చూస్తలేరా? వాళ్లు కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది. 20 గంటలు ఇస్తమని నరికి.. గెలిచి ఐదుగంటలు ఇస్తున్నరు. వాళ్లు కొడంగల్‌కు వచ్చి చెబుతున్నరు. మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. దొంగ కాంగ్రెస్‌ను నమ్మకండని కర్నాటక వాళ్లు చెబుతున్నరు. చాలా దోఖాబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది లేదు.. తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటే మన్ను కూడా లేదు. ఏ ఊరికి అభివృద్ధి రాలే. ప్రజల మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా? ఎక్కడికో పోయే రేవంత్‌రెడ్డి కావాలో ప్రజలు ఆలోచన చేయాలి.
పదేళ్లుగా కష్టపడ్డాం. చాలా సహాయం చేశాం. నరేందర్‌రెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించాలి. ఆయన పదవి పెరుగుతుంది. కొడంగల్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నేనే ఒకరోజు వచ్చి మీ మధ్యలోనే గడుపుతా. కొడంగల్‌లో ఉండి ఎన్ని వందలకోట్లు కావాల్నా.. ఏం పనులు కావాల్నా చేసి పెడుతాను. డబుల్ రోడ్లు, రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలు, కొత్త పరిశ్రమలు నరేందర్‌రెడ్డి కోరారు. నరేందర్‌రెడ్డి గెలిస్తే ప్రజలకు లాభం. రేవంత్‌రెడ్డి గెలిస్తే పైరవీకారులకే గానీ ప్రజలకు కాదు. నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే బ్రహ్మాండంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత. దొంగ రేవంత్‌రెడ్డి మాటలు విని నమ్మిమోసపోకండి మనవి చేస్తున్నా’నన్నారు.