నల్లగొండ : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శరవేగంగా నల్లగొండ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పట్టణంలోని రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి కోసం 88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరు అయిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.
వివేకానంద విగ్రహం నుంచి పెద్దబండ జంక్షన్ వయా బస్టాండ్ మీదుగా రోడ్ల అభివృద్ధికి రూ.46 కోట్లు, పట్టణంలోని వివిధ జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు, డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు రూ.18 కోట్లు, కలెక్టరేట్ నుంచి కేశరాజుపల్లి వరకు డివైడరింగ్, సెంట్రల్ లైటింగ్ కోసం 5 కోట్లు కేటాయించారు.
అలాగే సాగర్ క్రాస్ రోడ్ నుంచి కతల్ గూడెం వరకు 6 లేన్ల రోడ్డుకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అభివృద్ధి ప్రణాళికలను చర్చించి, ఆమోదించేందుకు సోమవారం హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఉన్నతధికారులతో సమావేశమయ్యారు.