అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానికి.. మహారాష్ట్రకు చాలా తేడా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో లేవు. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు మహారాష్ట్ర నుంచి వచ్చినా మాకు ఉపయోగం లేదు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల్లో కూడా బీఆర్ఎస్ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది.
– చెన్నూర్ ఆత్మీయ సమ్మేళనంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బీఆర్ఎస్ నేత వంశీ