బొంరాస్‌పేట, అక్టోబర్ 3: సీఎం కేసీఆర్ మాట తప్పని నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచినందుకు సోమవారం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్లలో జాతీయ రహదారిపై మంత్రితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.