దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాకుండా ప్రజల ఆత్మగౌరవం, ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టింది. దళితులకు మూడు ఎకరాలు, కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ కాలేజీలు, దళితబంధు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మొదలైన పథకాలను దళితుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ‘ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ 2017’ తీసుకువచ్చారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కోసం 26 కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. సీడీఎస్ ఒకప్పుడు ఉద్యమాలు, మరికొన్ని అంశాలపై అధ్యయనం చేసేది. ఇప్పుడు విద్యార్థులు, యువకులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నది.
– మల్లేపల్లి లక్ష్మయ్య సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపకులు, హైదరాబాద్