రామాయంపేట/మెదక్ రూరల్, ఆగస్టు 23: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తమ పాలిట దేవుడని దివ్యాంగులు, బీడీ టేకేదార్లు కొనియాడారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పారు. మెదక్‌లో దివ్యాంగులకు పింఛన్ పెంపు ఉత్తర్వులతోపాటు బీడీ టేకేదార్లకు ఆసరా పింఛన్ పత్రాలను సీఎం కేసీఆర్ అందజేశారు. దివ్యాంగులకు గతంలో రూ.3,016 పింఛన్ ఉండగా, దానిని రాష్ట్ర ప్రభుత్వం రూ.4,016కు పెంచిన సంగతి తెలిసిందే. మెదక్‌లో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ దివ్యాంగులు, బీడీ టేకేదారులుకు పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు.
కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేనిది
సీఎం కేసీఆర్‌ను దివ్యాంగులు జీవితకాలం మరువరు. దివ్యాంగుల దయనీయ పరిస్థితిని గమనించి రూ.3,016 ఉన్న పింఛన్‌ను రూ.4016కు పెంచారు. మా జీవితం ఇంత మంచిగ ఉంటదదని అనుకోలేదు. సీఎం కేసీఆర్ దయతో నెలనెలా డబ్బులు వస్తున్నయ్. మా దివ్యాంగులను ఆదుకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్‌సార్. ఆయన గెలుపు కోసం ఇప్పటి నుంచే పాటుపడతాం. – నసీర్ హుస్సేన్, దివ్యాంగుడు, మెదక్ పట్టణం
మా జీవితాలను నిలబెట్టిన నాయకుడు
దివ్యాంగుల జీవితాలను నిలబెట్టిన మహానేత సీఎం కేసీఆర్ సార్. ఎలచ్చన్లలో ఆయన మళ్లీ వస్తేనే మాలాంటి దివ్యాంగుల తలరాతలు మారతయ్. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మా గురించి ఆలోచించిన నాయకుడు లేడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని మాలాంటి దివ్యాంగులు బతుకుతున్నరు. మాకు పెదదిక్కు కేసీఆర్ సార్ మాత్రమే. దివ్యాంగులమంతా కలిసికట్టుగా మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటం. – దేవసోత్ బజన్, దివ్యాంగుడు, రాజ్‌పల్లి, మెదక్
మాకు పింఛన్ ఇచ్చిన దేవుడిని మరిచిపోం
నేను 20 ఏండ్ల నుంచి కార్ఖానా నడిపిస్తున్న. గప్పటి నుంచి ఏ ఒక్కరూ టేకేదారులను పట్టించుకోలే. సీఎం కేసీఆర్ సార్ మా టేకేదారులను గుర్తించి నెలకు రూ.2,016 పింఛన్లు ఇస్తుండు. గతంలో ఓ ఒక్కరూ చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్ సార్ చేసిండు. ఆయన వెంటే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో సీఎం సార్ ప్రకటించిన వారినే గెలిపిస్తాం.
– అంబటి ఆంజనేయులు, బీడీ టేకేదారు, డీ ధర్మారం, రామాయంపేట (మెదక్ జిల్లా)
టేకేదారులను గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
దశాబ్దకాలంగా సమైక్యపాలనలో ఎన్నో ప్రభుత్వలు వచ్చినయ్ గానీ టేకేదారులను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక పదేండ్ల నుంచి అన్ని రంగాల వారికి అభివృద్ధి పథకాలను మంజూరు చేస్తుండు. తెలంగాణ ప్రభుత్వం బీడీలు కంపెనీలు సరిగ్గా నడవడం లేదని మమ్మల్ని గుర్తించి మాకు పింఛన్లను మంజూరు చేసింది. మమ్ముల్ని గుర్తించి, మా కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. వచ్చే ఎలచ్చన్లలో మళ్లీ కేసీఆర్ సార్నే గెలిపిస్తం.
– పగిడిమర్రి రమేశ్, బీడీ టేకేదారు, రామాయంపేట (మెదక్ జిల్లా)