హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో కష్టాలను అధిగమిస్తూ, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతామని చెప్పారు. ఏటేటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ, సబ్బండవర్ణాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.