దర్శక, నటుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’. ఇదొక ఉత్కంఠతో కూడిన హింసాత్మక చీకటి ప్రపంచమని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా పోస్టర్‌తోపాటు ఓ గ్లింప్స్‌ని కూడా మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో రవిబాబు వైలెంట్ అవతారంలో కనిపించారు.
కారు ఇంజిన్ వాల్వ్ కవర్‌తో విలన్‌ను హతమార్చే సన్నివేశం ఈ సినిమా కల్చెర్ని తెలియజేస్తున్నది. తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: ఎస్.ఎస్.రాజేష్, సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేశ్‌బాబు, నిర్మాణం: ఫ్లయింగ్ ఫ్రాగ్స్.