శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘నవాబ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకుడు. రాధా వి.పపుడిప్పు నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. “చాయ్ వాలా’ అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. సెన్సార్‌వారు ఈ టైటిల్ విషయంలో అభ్యంతరం తెలియజేయడంతో ‘నవాబ్ కేఫ్’ అని మార్చాం. నిజానికి ‘నవాబ్ కేఫ్’ అనే పేరుతోనే దర్శకుడు ప్రమోద్ ఈ కథ రాశారు. చివరికి ఈ సినిమా పేరు అదే అయ్యింది.
అదే డెస్టినీ. నిజాయితీగా ఈ సినిమా చేశాం. అందరికీ కనెక్టయ్యే కథ ఇది. సినిమా చూసి బయటకొచ్చిన ప్రతి ఒక్కరూ తమ తండ్రులకు ఫోన్ చేసి మాట్లాడతారు. అంత ఎమోషనల్‌గా సినిమా ఉంటుంది.’ అని హీరో శివ కందుకూరి తెలిపారు. తాను చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాశానని దర్శకుడు ప్రమోద్ హర్ష చెప్పారు. ఇంకా కథానాయిక తేజు అశ్విని, సహనిర్మాత వెంకట్ ఆర్.పపుడిప్పు కూడా మాట్లాడారు.