CM KCR | ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా మంచి పని జరిగిందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘అప్రజాస్వామికంగా రాజ్యాంగ సంస్థలను దుర్వియోగంచేస్తూ. దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ సంస్థలను కూలదోస్తున్నరు. ఇప్పటికీ పది రాష్ట్రాలను కూల్చారు. సిగ్గు కూడా ఉండాలి చెప్పుకోవడానికి. తెలంగాణలో మూడు తోకలు లేవు.. ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు. కూలగొడతాం మిమ్మల్ని.. ఎలా కూలగొడుతవ్? మీకు పోగాలం వచ్చిందన్నమాట దానర్థం. ఈ మాటలు ఎవరు మాట్లడుతారు. ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడుందని, దేన్ని కొట్టాలో ప్రజలకు తెలియదా? ప్రతి రాష్ట్రంలో ఇవే పెడబొబ్బలు.
నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గెలిచిండు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు తమిళనాడులో ఏక్నాథ్ షిండే వస్తడని మాట్లాడుతున్నడు. షిండేలు ఎవరి కోసం.. ఎవరి బెదిరిస్తరు? ఎవరి గొంతు నొక్కుదామనుకుంటున్నరు? అందరు ఒకటై మీ గొంతు పడితే ఎక్కడికి పోతరు? ఇంతపెద్ద సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలున్నాయ్.. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తిరుగుబాటు చేసి పిలుపునిస్తే.. 40, 50 రోజుల్లోనే జైలులో పుట్టిన జనతా పార్టీ జెండా ఎగుర వేసింది. అది పవర్ ఆఫ్ డెమొక్రసి. సమయం వచ్చిన సమయంలో ప్రజలు చూసిస్తరు’ అన్నారు.
‘ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రధాని హయాంలో లేని విధంగా రూపాయి పతనమవుతున్నది. విపరీతంగా నిత్యావసరాల ధరల పెరుగుతున్నది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారుతున్నది. అంబాసిడర్లను పిలిచి బెదిరింపులకు దిగుతున్నరు. బ్లాక్ మనీ తెస్తామని చెప్పి ఒక్క పైసా తేలేదు. 20లక్షల ఉద్యోగాలు దేశంలో ఖాళీగా ఉన్నయ్. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారా? పేదలను ఆదుకున్నారా? సైన్యం రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తే దేశం అట్టుడికి పోయింది. రైల్వే స్టేషన్ల ఖాళీపోయాయి. అప్పటికప్పుడు పోలీసులతో అణచివేయొచ్చు. కానీ యువకుల గుండెల్లో రగిలే మంటలరు ఆర్పగలుగుతారా? అవి మిమ్ముల్ని దహించయా? ఎందుకీ అహంకారం?. కరెంటు సంస్కరణలపై గోల్మాల్ చేసి చెబుతున్నరు. దేశంలో స్థాపిత విద్యుశ్చక్తి ఎంత ఎందో తెలియాలి. దేశంలో విద్యుత్ శక్తి దేశంలో ఉన్నదని, దాన్ని ఇచ్చే తెలివి కేంద్రానికి లేదు. ఇది ఈ దేశ దురదృష్టం.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం దేశంలో స్థాపిత విద్యుశ్చక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్లు. ఇందులో రెండురకాల పవర్ ఉంటది. ఒకటి బేస్ లోడ్.. 24 గంటలు సప్లయ్ చేయగల ఫర్మ్ పవర్ దీన్ని బేస్‌లోడ్ అంటరు. దేశంలో బేస్‌లోడ్ 2,42,890 మెగావాట్లు ఉన్నది. పీక్‌లోడ్ అంటే దేశం అత్యధికంగా వినియోగించింది.. ఈ ఏడాది జూన్‌లో 22న 2,10,700మెగావాట్లు. బేస్‌లోడ్.. పవన, సౌర, జల విద్యుత్ కాకుండా బేస్‌లోడ్‌లో ఉండే పవర్ అంత కూడా ఈ దేశం వాడలే.. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా పవర్ వాడింది జూన్ 22నే. మనకు ఇంకా చాలా పవర్ చాలా అందుబాటులో ఉన్నది. కోసి, గండకీ నదుల ద్వారానే బిహార్‌లో వరదలు వస్తున్నయని చదువుకున్నం. చిన్నమార్పులతో ఈ రెండు నదుల డ్యామ్‌లు నిర్మిస్తే వేల మెగావాట్ల విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో బిహార్ దుఃఖంపోతుంది. ఎన్టీపీసీతో ఒక్క రామగుండం ఎలా బాగుపడిందో.. బిహార్ మారుతుంది. బిహార్‌కు ఎవరో పుణ్యాత్ముడు బీమార్ స్టేట్ పేరు పెట్టారు.. బీహార్‌లో బీమార్ లేదు.. పెట్టినోడి నెత్తిలోనే ఉన్నది’ అన్నారు.
థర్మల్ ద్వారా 2,04,080 మెగావాట్లు, గ్యాస్ ద్వారా దేశంలో 24,900మెగావాట్లు, అణువిద్యుత్ ద్వారా 6,780 మెగావాట్లు, లిగ్నైట్ ద్వారా 6,620మెగావాట్లు, డీజిల్ ద్వారా 510మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నది. ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టిందే.. ఇప్పుడు పెట్టేది అనుకూలమైన సావుకారు.. 50, 60, 30వేల సోలార్ ప్లాంట్లు పెడుతమని తిరుగుతున్నరు. వాళ్ల కోసమే ఈ విద్యుత్ సంస్కరణలు. దేశంలో లక్షల టన్నుల ఉందని, దాని ద్వారా కరెంటు ఉత్పత్తి చేయొచ్చని.. దాన్ని వాడే మొఖం లేదా? ప్రపంచమంతా వాడుతూ వెలుగులు సృష్టిస్తుంది.
40వేల మెగావాట్ల కార్ఖానాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, చాలా ప్రాంతాల్లో తయారై.. విద్యుత్ తయారు చేసేందుకు రెడీగా ఉన్నాయ్. ఈ బ్యాడ్ పవర్ పాలసీతో స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్నయ్. కేంద్రం నిర్ణయాలతో ఇవాళ తెలంగాణ చాలా నష్టపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం 5వేలకోట్లు, ఐదేళ్లలో 25వేల నష్టపోవాలా? చాక్లెట్ ఉన్నది తీసుకుంటవా? లేకపోతే నీకివ్వా అంటే.. నువ్వే ఉంచుకో రైతులకు నేను ఫ్రీగా కరెంటు ఇస్తా అని చెప్పా. 25వేల కోట్ల ఆర్థికలోటు ఈ కేంద్ర ప్రభుత్వం అవివేకం వల్ల, అనుచిత వైఖరి వల్ల తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కోల్పోతున్నరు. చచ్చినా సరే పెట్టమని చెప్పాం. పెట్టకపోతే ఇక ఖతమేచేస్తాం.. ఇగ అదే.. ఈ నోటిఫికేషన్’ అన్నారు.
‘దేశంలో మీటర్ లేనిదో కొత్త కనెక్షన్ ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మేక్ ఇన్ ఇండియా అన్నరు.. ఫలితం ఏంటంటే పతంగి ఎగురవేసే మంజా చైనాదే. జెండా చైనాదే.. దీపావళికి కాల్చే పటాకులు చైనావే. మనకు గీసుకు బ్లేడు చైనాదు.. గోర్లు కత్తించుకునే నేయిల్ కట్టర్ చైనాదే. ఇదీ మేకిన్ ఇండియా.. ఇంకా ఎన్ని రోజులు డబ్బా కొడుతురు. పవర్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని.. నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి దేశానికి పనికిరావు. నిన్ను చంపేస్తా.. నువ్వు మీటర్ పెట్టే తీరాలాంటే.. ఏం చేయాలి. ఏం చేసైనా తెలంగాణ పవర్ బంద్ చేయించాలి. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్తా.. నేను బాధతో చెబుతున్నా.. చిల్లర రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం.. అన్నిరంగాలకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మా డబ్బుల నుంచి మేం వ్యవసాయానికి కరెంటు ఇచ్చుకుంటే ఇబ్బందేంది.
వాస్తవాలు ఇలా.. ఉల్టా పల్టా చేసి.. మాయా మశ్చీంద్ర చేస్తున్నరు. అన్నీ అబద్ధాలు చెస్తున్నరు. వైద్య కళాశాలలు ఇవ్వాలని మంత్రి లేఖలు రాస్తే.. మాకు ప్రతిపాదనలు రాలే అని మంత్రి చెబుతడు. నవోదయ విద్యాలయాలు కావాలని నేను ప్రధాని అడిగితే ఇవ్వలే. మేం రైతులకు కోసం పని చేస్తుంటే.. తెలంగాణలో విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నరు. రఘునందన్ రావు తెలంగాణలోనే ఎమ్మెల్యే అనుకుంటే ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది రూ.17,828కోట్లు. ఇవి ఇప్పియ్యమంటే మాట్లాడరు. ఇదేం పద్ధతి. దాంట్లో నుంచి మినహాయించుకొని రూ.6వేకోట్లు ఇప్పియ్యండి ధర్మముంటే..? శాసన సభ నుంచి అడుగుతున్నా ఇవాళ. ఇది అబద్ధమైతే వితిన్ సెకండ్లో నేను రాజీనామా చేస్తా.
ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చిండు. దాన్నే వాడే తెలిసి ఈ కేంద్రానికి లేదు’ అంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్న అపారమైన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలో చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. సంస్కరణ పేరిట దేశాన్ని కేంద్రం దగా చేస్తున్నది, దేశం మేల్కొని బెబ్బులిలా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీన్ని నిలువరించేందుకు ఎక్కడి వరకైనా తాము పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని, దాదాపు ఏడాది, ఏడాదిన్నరలో ఇప్పుడు ఉన్న కాస్లీ పవర్ బంద్ అవుతుందని, యాదాది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు దగ్గర పడ్డాయన్నారు. త్వరలోనే వచ్చే శీతాకాల సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించి.. ఆ సమయంలో కేంద్రం అసంబద్ధ విధానాలను ఎండగడుతామన్న సీఎం కేసీఆర్.. విద్యుత్ సంస్కరణలపై ఒక్కో లైన్లో దాని అంతరార్థం గౌరవ సభ్యులకు వివరిస్తానన్నారు.
బయిలకాడ మీటర్లు పెడితే.. ఈ భారత రైతాంగాన్ని అద్భుతమైన ఉప్పెనలా ఉద్యమాన్ని లేవదీసి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని, భారత రైతాంగానికి ఉచిత ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ఇటీవల 28 రాష్ట్రాల రైతులతో సమావేశం జరిగిందని, వారంతా సార్ మీరు బయలుదేరండి దేశంలో పెద్ద విప్లవం తెద్దామని, కాస్కోండి ఆ విప్లవం రాబోతోంది.. జాగ్రత్త అంటూ కేంద్రాన్ని కేసీఆర్ హెచ్చరించారు. బెదిరింపులు జరిగేదీ ఏమీ లేదని, 20 నెలల తర్వాత ఇవే మీకు రివర్స్ అవుతాయని, ఇతర పార్టీల ప్రభుత్వాలను గౌరవించాలని, ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని, కేంద్రం పొట్టకండి అంటూ రాష్ట్ర, దేశ రైతాంగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.