CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, తలసరి ఆదాయం పెంచి, పవర్ పెంచి, శుద్ధ నీటిని నల్లాల ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చి.. తెలంగాణ సాధించుకువచ్చి అష్టకష్టాలు పడి, యజ్ఞంలా తీసుకుపోతావుంటే.. కేసీఆర్కు పిండం పెండుతాం అంటున్నారు. ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టండం? ఈ తిప్పలు పడ్డందుకా పిండంపెట్టడం? అని ప్రశ్నించారు.
‘కరోనా మహమ్మారితో 95 రోజులు ప్రభుత్వమే ఆంక్షలు విధించిన పరిస్థితి. ఆ సంవత్సరం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. ఆ తర్వాత క్రమశిక్షణతో పటిష్టమైన వ్యూహరచనతో దాన్ని అధిగమించాం. శాసనసభ సభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చే డబ్బులు కాంగ్రెస్ హయాంలో ఎంత ? రూ.50లక్షలు దాటలేదు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యింది కాబట్టి ప్రతి సభ్యుడు రూ.5కోట్లు ఖర్చు చేసేందుకు కేటాయిస్తున్నాం. భారతదేశంలో ఏసీడీపీ ద్వారా ఎక్కడ రూ.5కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చేసే వారిని పట్టుకొని విషప్రచారం చేస్తున్నారు. చెప్పిందే పది, వందసార్లు చెబితే నిజమవుతుందని సామెత ఉంది. కేసీఆర్ బాగా అప్పులు చేశారంటున్నారు. అప్పుల్లో తెలంగాణది 23వ స్థానం. మనకన్నా ఎక్కువ చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి. మనం పరిమితికి లోబడి ఉన్నాం. క్రమశిక్షణతో ఉన్నాం. కేంద్రం ఇచ్చిన మొన్న పార్లమెంట్లో తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని చెబుతున్నది. తక్కువ అప్పులతో చక్కగా చేసుకుంటూ పోతున్నాం. లోక్సభ సాక్షిగా ఇదే చెప్పింది’ అని గుర్తు చేశారు.
‘ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, తలసరి ఆదాయం పెంచి, పవర్ పెంచి, శుద్ధ నీటిని నల్లాల ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చి.. తెలంగాణ సాధించుకువచ్చి అష్టకష్టాలు పడి, యజ్ఞంలా తీసుకుపోతావుంటే.. కేసీఆర్కు పిండం పెండుతాం అంటున్నారు. ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టండం? ఈ తిప్పలు పడ్డందుకా పిండంపెట్టడం ? మీ నాయకులు ఎందరో వెన్నుచూపి పారిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని.. దీక్షలు చేసి, చివరకు నా చావుమీదకు తెచ్చుకున్నంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పిండం పెడతమంటే ఎవరు హర్షిస్తరు ? ఇదేనా సంస్కారం. చాలా బాధ కలుగుతుంది. నోరుంది కదా అని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీ పార్టీలో నియంత్రణ లేదు కావచ్చు సమాజం చూస్తుంది కదా? నన్ను అడుగుతున్నరు’ అన్నారు.
‘మొన్న రాహుల్ ఒక మాట అంటే రెండేళ్ల జైలు శిక్ష విధించారు. సభ్యత్వం కూడా తీసివేశారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మేము కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేమా? మీరు స్వేచ్ఛ కావాలంటే ఇచ్చాం. లిబరల్గా, డెమొక్రటిక్గా వ్యవహరిస్తున్నాం. లేకపోతే మీరు మాట్లాడిందానికి తాటతీయడం పెద్ద ఇష్యూ కాదు కదా? కానీ, మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నా సంయమనం పాటిస్తున్నాం. ప్రజలే బుద్ధి చెబుతరని ముందుకెళ్తున్నాం. ఎక్కడ ఏం చేయనోళ్లు.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జనంపైకి తుపాకులు తీసుకొని పోయినోళ్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరీంనగర్లో రైఫిల్ తీసుకొని పోయిండు. ఇంకో పార్టీ అధ్యక్షుడు మాత్రం అందరు రాజీనామా చేస్తుంటే ఆయన మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు పారిపోయిండు. యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే.. స్వయంగా వెళ్లి గెలిపించాం. ఇవన్నీ ప్రజల ముందే జరిగాయి’ అన్నారు.
‘దళితబంధు అందరికీ ఇవ్వాళి.. తొందరగ ఇవ్వాలని మాట్లాడుతున్నరు. ఎక్కడిది దళితబంధు. మీ జన్మలో దళితబంధు ఇవ్వాలని ఆలోచించారా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్య్రం సాధించిన తర్వాత తొలిరోజు నుంచే దళితుల వృద్ధి గురించి పని చేసి ఉంటే ఇవాళ దళితబంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది ? మమ్మల్ని అనడం కాదు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేము ఇవాళ దేశానికి దిక్సూచిగా ఉన్నాం. మహారాష్ట్రకు వెళ్లి మాట్లాడుతుంటే.. వేనోళ్ల మాట్లాడుతున్నరు తెలంగాణ మోడల్ కావాలని అంటున్నారు. దేశమంతా మాకు తెలంగాణ మోడల్ కావాలని అంటుంటే.. ఇక్కడున్నోళ్లు మాత్రం హర్షించకపోగా.. దూషించడం, పిండంపెడతం అంటున్నరు. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే ఇప్పుడు నిర్ణయించాలి’ అన్నారు.